1444) నాదు హృదయపు ద్వారము తెరచెదను

** TELUGU LYRICS **  

    నాదు హృదయపు ద్వారము తెరచెదను
    యేసు పాపపు రోగికి నీవే గతి

1.  యేసు చచ్చిన వారిని లేపితివే - మరి కుంటికి కాళ్ళను ఇచ్చితివే
    నేను పాపిని రోగిని నీవేగతి - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ

2.  ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివి
    నాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుద్ధత నియ్యుము నీవేగతి

3.  యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా
    నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ నాకు వేరొక మార్గము లేదికను

4.  ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగా
    నేను పాపిని అంధుని యేసూ ప్రభూ - నను దాటకు దిక్కిక లేదు ప్రభూ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments