1514) నా యేసు నొప్పుకొనను నే సిగ్గునొందను

** TELUGU LYRICS **

1.  నా యేసు నొప్పుకొనను నే సిగ్గునొందను
    నా యేసుకై పోరాడను నే వెన్కదీయను
    పల్లవి: సిల్వలో సిల్వలోఁ గాంచి నే చూడఁగన్
    చింతలన్ భారమెల్లఁ బోయనే - విల్వలేనట్టి
    రక్తమున్నమ్మన్ - విశ్వంబైన ముక్తి గల్గెనే

2.  నా దేవుని పేరేసుండు నా కేమి లోపము
    ఇదే నా సునిరీక్షణ యింకేమి భయము

3.  బాహాటమై నా భారము భరింపనాయెనే
    మహాత్ముని వాగ్దానము మార్పొంద దెన్నడు

4.  న్యాయంపు తీర్పు నాటిలో నన్నొప్పుకొంచును
    నా యేసు తండ్రి యానతిన్ నాకంబుఁజేర్చును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------