** TELUGU LYRICS **
నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే నా ప్రాణ
ధనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తిబాట నా యన్న
రాఁగదే నా యన్న సిలువలో నీ వాయాసపడిన నాఁటి నీ
యంఘ్రియుగమునిపుడు నా యాసఁదీరఁజూతు

||నా యన్న||
1. ఒక తోఁట లోపట నాఁడు పడిన సకల శ్రమ లిచ్చోట నికటమై
యున్నట్లుగా నిట్టూర్పులతోఁ దలంతు నకట నా రాతి గుండె శకలంబై
పోవునట్లుగా
||నా యన్న||
2. పరమాశ్చర్యము గాదా యీలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకౌ
ముల్లుల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకం దిచ్చెడు నీ
కరుణన్ దర్శింతు నేఁడు

3. ఇచ్చక మిది గాదు మిగులఁ దలపోయ ముచ్చట దీరదు అచ్చి వచ్చిన
నా యవతారుఁడ నీ ప్రక్క గ్రుచ్చు గాయము లోపల నేఁ జొచ్చి నీ
ప్రేమఁ జూతు

4. తల వంచి సిగ్గున నేఁ జేయు నేర ముల నెంతు నాలోనఁ బలు మారు
నీ గాయములఁ గెలికి నిన్ శ్రమపరచు నా ఖల దోషములకై యిపుడు
పిలిపించి వేఁడుకొందు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :