1426) నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా

** TELUGU LYRICS **

    నా తోడు నీవే దేవా
    నా బలము నీవే ప్రభువా
    నా ధైర్యం నీవే దేవా
    నా క్షేమం నీవే ప్రభువా
    కాపాడే దైవం నీవేగా – కనుపాపగ నన్ను కాచేగా
    నీ దయలో నీ కృపలో నీ ఒడిలో నన్నిలలో

1.  నాలో కన్నీరే నీవైపే చూడగా
    నీవే యేసయ్య సంతోషం నింపగా
    నిట్టూర్పు లోయలలో గాఢాంధకారములో
    నీవే నా అండగా నన్ను బలపరచగా
    నడిపించే వాక్యం నీవైతివీ
    కరుణించే దైవం నీవైతివీ
    నీ దయలో నీ కృపలో

2.  ఎన్నో కలతలే నామదిలో నిండగా
    నీవే యేసయ్య నావెంటే ఉండగా
    నా భయమును తొలగించి విశ్వాసము కలిగించి
    నీవే నా అండగా నన్ను స్థిరపరచగా
    నీవుంటే చాలు నా యేసయ్య
    నీ ప్రేమే నాకు చూపావయ్యా
    నీ దయలో నీ కృపలో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------