1523) నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు

** TELUGU LYRICS **

    నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు ఘోర పాపుల పాప భార విమోచక
    ||నా రక్షకా||

1.  నిత్యకాలమునందు నిజమైన దేవుని సత్యవాక్యమై యున్న స్వామి
    నిన్నుతియింతు 
    ||నా రక్షకా||
    
2.  సర్వ లోకంబులను సత్యవాక్యమై యుండి నిర్వహించిన దేవుని
    నిజబాహువా స్తుతింతు
    ||నా రక్షకా||

3.  దేవజనులకు సువార్త దెలుప నభిషేకంబు పూని నొందిన దేవపుత్రుడ
    నుతియింతు
    ||నా రక్షకా||

4.  దేవ మహిమ ప్రకాశ దీనరక్షక మాను ష్యావతారము దాల్చి
    యావదాజ్ఞల దీర్చిన
    ||నా రక్షకా||

5.  పావనాద్భుతుడవై పరమ జ్ఞానము దెల్పిన దేవస్వభావ ముద్ర
    దేదీప్యుడా స్తుతింతు
    ||నా రక్షకా||

6.  పాపాత్ములను గావ శాపభారము క్రింద నోపికతో నిల్చి ప్రాపు
    జూపిన ప్రభువా
    ||నా రక్షకా||

7.  ఈ వసుధను ప్రేమ నెసగునట్లుగ జూపి చావు గెల్చిన సర్వ సామర్థ్యుడా
    స్తుతింతు
    ||నా రక్షకా||

8.  ఘన దేవుని కుడి పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి నొనరించు నా యేసు
    వినయ స్తోత్రంబిదిగో
    ||నా రక్షకా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------