1488) నా ప్రియుడు నావాడు నేను అతని వాడను

** TELUGU LYRICS **

    నా ప్రియుడు నావాడు నేను అతని వాడను

1.  నీవు బహు ప్రియుండవనుచు - దానియేలునకు
    దివ్యముగ నభయంబిచ్చిన మా - పరమజనకుండా

2.  ఈయనే నా సంతసమైన - ప్రియతనయుండు
    ఈయన మాట వినుడనిన - పరమజనకుండా

3.  ఎన్ని సంద్రముల జలరాసుల్ - ఆర్పగాలేని
    ఉన్నతంబైన నీ ప్రేమన్ - ఎన్న మా తరమా

4.  కల్వరిన్ చిందించిన నీదు - రక్త ధారలతో
    కడిగితివి మా పాపములన్ని - కరుణగల క్రీస్తు

5.  మా పై నపవాది నదిబోలి - పొర్లిపారినను
    ముంచి వేయగ జాలదు మమ్ము - మాతో నీ వుండన్

6.  క్రొత్త వత్సరమును దానముగా - నిచ్చిన క్రీస్తు
    క్షణక్షణం నడిపింతువు మమ్ము - విజయవంతముగా

7.  నీదు రాకడ కై దినదినము - వేచియున్నాము
    నిత్య మహిమలో నీతో మేము – మెరయుచుందుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------