** TELUGU LYRICS **
నా ప్రియుడా - పాప విమోచకుడా - ప్రభుయేసు (2)
నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను (2)
స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు (2)
నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను (2)
స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు (2)
1. యేసుని రక్తమందు - ముక్తి లభించెను - స్తుతించెదన్
యేసుని నిత్య జీవము - పొందెదను నిశ్చయం
యేసునకె నా స్తుతి సుమములు - సుమధురం
యేసుని నిత్య జీవము - పొందెదను నిశ్చయం
యేసునకె నా స్తుతి సుమములు - సుమధురం
2. తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్
తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ
తల్లి మరిచిన మరువ డేసు - నిరతము
తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ
తల్లి మరిచిన మరువ డేసు - నిరతము
3. సూర్యకాంత సుగంధ సునీల - సువర్ణము
సూర్యతేజస్సు మించిన - ఆ వెల్గు రాజ్యములో
సూర్యునివలె తేజరిల్లెదను - నా యేసుతో
సూర్యతేజస్సు మించిన - ఆ వెల్గు రాజ్యములో
సూర్యునివలె తేజరిల్లెదను - నా యేసుతో
4. బూరశబ్దముతో నీవరుదెంచు - దూతలతో
నాకై గాయపడిన - బంగారు నీ మోమున్
రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్
నాకై గాయపడిన - బంగారు నీ మోమున్
రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్
5. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు
జీవవృక్షమున చెంత జీవనదిని చేరి
హల్లెలూయ హల్లెలూయ – ఎల్లప్పుడు
జీవవృక్షమున చెంత జీవనదిని చేరి
హల్లెలూయ హల్లెలూయ – ఎల్లప్పుడు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------