2470) ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని

** TELUGU LYRICS ** 

    ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తిసాధన
    ములకు మూలము భక్తిగొని యానంద మొందరే 
    ||ముక్తి||

1.  పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మది
    మీకిడుదునని పరమరక్షకుఁ డాన తిచ్చెను
    ||ముక్తి||

2.  ఇచ్ఛయించెడు వాఁడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చు
    కొనుగా కనుచుఁ బల్కెను సచ్ఛరితుఁడు మనుష్య పుత్రుఁడు
    ||ముక్తి||

3.  ఆకసమునందుండి యిటు దిగి లోకమునకుఁ జీవము నొసఁగునది
    ఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము
    ||ముక్తి||

4.  నేనె మార్గము నేనె సత్యము నేనె జీవము నావలననే గాని యెపఁడును
    తండ్రి యొద్దికి రానలవిగాదని వచించెను
    ||ముక్తి||

5.  జీవజలము నుద్రావుటకు మీ భావన లనెడి పాత్ర ముంచుచు చేవఁ
    గొని పానించుచు నిరత జీవమును వెలుఃగొంది బ్రతుకను
    ||ముక్తి||

6.  ఎక్కడను యిటువంటి ప్రభువును మక్కువను వేసారి వెతకిన చిక్క(బో
    డిటువచ్చి జూడుడి గ్రక్కునను జేసట్టు డిప్పుడే
    ||ముక్తి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------