** TELUGU LYRICS **
మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా
||మనసు||
1. అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ
యది యనుసరించినావ అది యరసి చూచినావ?
||మనసు||
2. అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ
మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును
2. అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ
మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును
||మనసు||
3. రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స
ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట
3. రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స
ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట
||మనసు||
4. ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది
ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన
4. ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది
ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన
||మనసు||
5. సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి
దుర్గుణహారి మనకోటకు రహదారి
5. సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి
దుర్గుణహారి మనకోటకు రహదారి
||మనసు||
6. వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని
బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల
6. వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని
బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల
||మనసు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------