2348) మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే

** TELUGU LYRICS **

    మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు
    క్షీణం బగుచున్నది గదవే 
    ||మనసా||

1.  చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక
    యెంతసేపు నీ యంతట నుండెదవే
    ||మనసా||

2.  లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన
    ప్రభువును ప్రాకటముగ నమ్ము 
    ||మనసా||

3.  మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమని
    నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా
    ||మనసా||

4.  రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియే
    సమయము తక్షణమున వేఁడు
    ||మనసా||

5.  అందరమును గూడి యేసుని మందిరమునఁ జేరి పొందుగ క్రీస్తుని
    పొగడుచుఁ బాడుచు నందునఁ జేరుదము
    ||మనసా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------