2336) మనమేసుని వారలము తనవారిగానే యుందుము

** TELUGU LYRICS **

    మనమేసుని వారలము - తనవారిగానే యుందుము
    మనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము

1.  కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను
    కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో
    తన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము

2.  వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను
    మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారనే
    ప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము

3.  దైవపుత్రుండు సజీవరాళ్ళతో - యింటిని కట్టుచున్నాడు
    దేవుని తేజము రాగా - మహిమతో నిండె గృహము
    ఆయన మందిరములో - తన మహిమను పాడెదము

4.  ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను
    పిలిచి నీతిగా తీర్చి - మహిమ పరచెను
    తన తనయుని రూపమిచ్చె - మన మానంద మొందెదము

5.  పూర్ణమహిమతో మనప్రభు యేసు - దూతలతో వచ్చును
    కనిపెట్టు వారెత్తబడెదరు - తన మహిమ పొందెదరు
    తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము

6.  మహిమ నివసించు మహిమ రాజ్యంబు
    మహిమతో నిండి యుండును
    మన ప్రభువే దీపమై యుండును
    తన వెలుగు ప్రచురమగున్
    యుగయుగములు మనమంతా
    ప్రభుయేసుతో నుండెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------