2412) మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమము

** TELUGU LYRICS **

మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమము
సర్వోన్నతుడా నీ మహిమను నే ప్రచురించుటయే భాగ్యము
ఆరాధన ఆరాధన (2)

ఉదయమున నీ కృపను గూర్చియు
రాత్రిజామున విశ్వాస్యతను (2)
పదితంతుల స్వరమండలముతో
గంభీర ధ్వనిగల సితారతో (2)
ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము
ఆరాధన ఆరాధన (2)

మందిరావరణమున నాటబడి
నిత్యము చిగురించి వర్ధిల్లుచూ (2)
ఖర్జూర వృక్షమువలె నీ వాక్యపు నీడలో ఎదుగుచూ (2)
స్తుతియించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము
ఆరాధన ఆరాధన

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------