2398) మహిమయుతుడు మా యేసు రాజు

** TELUGU LYRICS **    

    మహిమయుతుడు మా యేసు రాజు
    మహిమదూత సైన్యము తోడ
    ఇహకు వచ్చున్ మహానందము

1.  ఇమ్మహి అతిశయిల్లు - దూతలు ఆర్భటించ
    దూత వెల్గుతోడ మేఘముపై యేసు
    సమ్మతిన్ రాగా సంధింతుము వేగ
    ఆ ... ఆనందము

2.  బూరశబ్దించగానే - వాంచలు తీరుటకు
    మిత్రునిచెంత భక్తులందరు చెరి
    హర్షంబుతోడ పాడి స్తుతింతుము
    ఆ ... ఆనందము

3.  భూమి గోత్రములును - దేశాధికారులును
    ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొంద
    ఇమ్ముగ మేమును చేరుదు మచ్చట
    ఆ ... ఆనందము

4.  వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములు
    తీరిన పిదప మిత్రునితో మేము
    జయప్రదులమై నిత్యమేలుదుము
    ఆ ... ఆనందము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------