2397) మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు

** TELUGU LYRICS **

    మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు నిర్మల వినోద
    ధ్వనులు నిలుతురు అహమ మా యఘంబు లెల్ల నణచె వీని నామమనుచు
    బహు విధంబులైన పాట ల్బాడుచు నాడుచు వేఁడుచు గూడుచు 
    ||మహిమ||

1.  శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టున
    నతులితంబు లైన కాంతి గతుల నమర మింటఁ బాడ నీతీరు నెవరు
    దెచ్చి రచటి కేగతిఁ దాఁగూడి మ్రోగఁగ సాగిరి
    ||మహిమ||

2.  వింతయైన మతులు జేయఁగా నెవఁడు తనదు విలువలేని నల్లఁ
    జల్లగ సమసెనో యఘంబు లట్టి జనకుఁడైన ప్రభువు నెదుట నమల
    కోమలంబులైన యాటలఁ బాటల మీటుచుఁ జాటుచు
    ||మహిమ||

3.  తాము ప్రభుని కృపను మిగులను జూచి యతని దయను లోక మందు
    వేడ్కను బ్రేమఁజెంది యిపుడు గొఱ్ఱె పిల్లయైన ప్రభువు నెదుట దాము
    మోద మలర నిలిచి వేమరు దామెల్ల నా మోముఁ బ్రేమించి
    ||మహిమ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------