2426) మాధుర్యంపు నామము మోదమిచ్చుగానము

** TELUGU LYRICS **

1.  మహావైద్యుండు వచ్చెను - బ్రజాళి బ్రోచు యేసు
    సహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్
    పల్లవి: మాధుర్యంపు నామము - మోదమిచ్చుగానము
    వేదవాక్య సారము - యేసు దివ్యయేసు

2.  మీపాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్
    గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు

3.  వినుండి గొర్రెపిల్లను - విశ్వాసముంచి యేసున్
    ఘనంబుగన్ స్తుతించుడి - మనంబుప్పొంగ యేసున్

4.  ఆ రమ్యమైన నామము - అణంచు నెల్ల భీతిన్
    శరణ్యులైనవారి నా - దరించు నెంత ప్రీతిన్

5.  ఓ యన్నలారా - పాడుడీ యౌదార్యతన్ సర్వేశున్
    ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసు

6.  ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్
    దపించువారి దాతయౌ - దయామయున్ శ్రీ యేసు

7.  శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును
    ప్రియంపు దాసులౌచుచు - రయంబు కొల్వుడేసున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------