** TELUGU LYRICS **
మారు మనస్సు పొందుము - ప్రభుని రాజ్యము సమీపించెను
1. యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెను
తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు - తన శౌర్యమునెంతో చాటెదరు
2. ఆయన రాజ్యము శాశ్వతము ఆత్మలో దీనులగువారు
ఆ రాజ్య వాసులగుదురు - ఆయనకే మా వందన స్తుతులు
3. నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును
ఆత్మ జన్మమును గలవారై - ఆ రాజ్యములోన చేరెదరు
4. రక్తమాంసంబులు దానిని స్వతంత్రించు కొనజాలవు
స్వాస్థ్యం పాపులకసలే లేదు - దుష్టులకందులో భాగములేదు
5. అంధకార రాజ్యమునుండి పొందుగా తన రాజ్యంబునకు
ప్రభుదెచ్చె ప్రియమారగ మనల - ప్రశంస స్తుతి చెల్లించెదము
** ENGLISH LYRICS **
Maaru Manassu Pondhumu - Prabhuni Raajyamu Sameepinchenu
1. Yehovah Dhevuni Raajyamu Mahonnathamai Vyaapinchenu
Thana Raajyaprabhaavamun Thana Prajalu - Thana Shauryamunentho Chaatedharu
2. Aayana Raajyamu Shaashwathamu Aathmalo Dheenulaguvaaru
Aa Raajya Vaasulagudhuru - Aayanake Maa Vandhana Sthuthulu
3. Noothana Janmaanubhavamu Dhwaara Choothuru Aa Raajyambunu
Aathma Janmamunu Galavaarai - Aa Raajyamulona Cheredharu
4. Rakthamaamsambulu Dhaanini Swathranthrimchu Konajaalavu
Swaasthyam Paapulakasale Ledhu - Dushtulakandhulo Bhaagamuledhu
5. Andhakaara Raajyamunundi Pondugaa Thana Raajyambunaku
Prabhu Decche Priyamaaraga Manala - Prashamsa Sthuthi Chellinchedhamu
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------