** TELUGU LYRICS **
1. బూర శబ్దంబు ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట
ఓర్పుతో మేము వేచియుంటిమి నిద్రించే వారు నిలతురిలన్
పల్లవి: ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా
రమ్ము మా యేసు - పాడెదము - హల్లెలూయ - ఎంతో సంతోషం
ఎగిరి పోయెదం - పాటలతో

2. భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు

3. వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చయినవాడు - నాకొరకై శ్రమ సహించెను

4. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్
మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట

5. పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద
దూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు
ధరించి ఘనతనొందే దినం

6. హల్లెలూయా - ఆనందించెదం హల్లెలూయా - ఆర్భటింతుం
హల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :