2254) భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము

** TELUGU LYRICS **

1.  హాయానంద సుదినము - నా యేసున్ నమ్ముదినము
    ప్రయాసమెల్ల బోయిన - దయారక్షణ్యదినము
    పల్లవి: 
భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము
    భక్తి ప్రార్థన లేసుడు - ప్రఖ్యాతి నాకు నేర్పిన
    భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము

2.  ప్రభునితో నిరంతరమౌ - నిబంధన జేసికొంటి
    నేబట్టితి నింపొందగ - విభుని పాదపద్మము

3.  నాయాత్మ శాంత మొందుము - నీ యేసే నీ యాధారము
    భయంబులేక రక్షణన్ - పాలిభాగంబు పొందుము

4.  నే నేసువాడ నేసుడు - నిత్యంబు నా వాడయ్యెను
    నా దెంత గొప్ప భాగ్యము - నే నేసుయొక్క మిత్రుడన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------