501) ఏమౌతానో అని నీకేమి చేసానని

ఏమౌతానో అని నీకేమి చేసానని
నదిలా ప్రవహించెను నీప్రేమ (2)
అమ్మ, నాన్న లాలి పాడకముందే
చూసావు నన్ను, రాసావు నాకై
కలిగున్న నీఆశలే, కలిగున్న నీఆశలే
ఏమౌతానో అని నీకేమి చే సానని
నదిలా ప్రవహిం చెను నీప్రేమ
మంటినైన ననుచూచి సారెపై ననుమలచి
పేరుపెట్టి విలువనిచ్చినావు
పగిలిన పాత్రను పట్టించుకున్నావు
గాయాల చేతితో అతికించుకున్నావు
ఏమౌతానో అని నీకేమి చే సానని
నదిలా ప్రవహించెను నీప్రేమ
వట్టిపాత్ర ననుచూచి నూనెతో నింపావు
నిండు పొర్లు దీవెనతో పలుకరించినావు (2)
నీఆస్తిగా నన్ను ముద్రించుకున్నావు
నీఇంటి పాత్రగా ఓ స్థానమిచ్చావు
ఏమౌతానో అని నీకేమి చే సానని
నదిలా ప్రవహించెను నీప్రేమ

No comments:

Post a Comment

Do leave your valuable comments