502) ఏ ముఖాంబుతోడ వత్తు యేసు

    ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు మ్రోల కావరించి నిన్నుమఱచి
    యేక మైతి బామరులతో నేది దారి నిన్నుఁ జేర నేమో తెలియదాయెను
    ||ఏ ముఖంబు||

1.  నీచ పాప వర్తనంబు పేచ మెల్లఁ బాపి ముందు కాచి పెంచి నియము
    నిష్ఠ లాచరణము నిలుపుకొరకు దోషభార మెల్ల బాపఁ బూచినీ దె
    నిజముగా ||ఏ ముఖంబు||

2.  తుట్టతుదకు నిన్ను ఁ జేరఁ గట్టినాఁడం గంకణమును వట్టిమాటకాదు
    నిజము పట్టి నడుపు పరమ పురికిఁ బట్టికొనుమునాదు చేయి మట్టి
    పాలు కాకమునుపే ||ఏ ముఖంబు||