516) ఏ సమాచారం నమ్ముతావు నువ్వు నువ్వు

** TELUGU LYRICS **    

    ఏ సమాచారం నమ్ముతావు నువ్వు!నువ్వు!
    కంటికి కనిపించే చెడ్డ సమాచారమా!
    విశ్వాస నేత్రాల మంచి సమాచారమా!
    దుష్టుడు నసపెట్టే దుష్ట సమాచారమా!
    యెసయ్య వినిపించే సత్య సమాచారమా!
    ఏ సమాచారం నమ్ముతావు నువ్వు!అరె నువ్వు!

    I....I believe the report of jesus
    We...We believe the report of jesus

1.  వైద్యులు చెప్తారు Reportsయిస్తారు ఈ వ్యాధి నయం కాదని
    బలహీనమైయున్న శరీరం చెబుతుందినే యిక కోలుకోలేనని
    వద్దు వద్దు వద్దుదాన్ని నమ్మవద్దు యేసుని మాట నమ్మరా!
    నీ రోగమంతా నే భరించానంటూ ప్రభువు చెప్పె సోదరా!
    యేసయ్య పొందిన దెబ్బల వలన స్వస్ఠతుందిరా!

2.  దుష్టుడు చెప్తాడు,మొసము చేస్తాడునే పని అయిపొయిందని
    పరిస్థితులు నిన్ను వెక్కిరిస్తాయి నువ్ చేతగానివాడనని
    లేదు లేదు లేదు ప్రభువు చెప్తున్నడు నీకు నిరేక్షణుందని
    ముందు గతి ఉంది మేలు కలుగుతుంది నే ఆశ్భగము కాదని
    నేవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని!

3.  పోటీని చూశాక మనస్సు చెప్ప్తుంది నువ్వు దేన్ని గెలవలేవని
    గత ఓటమి చెప్తుంది హేళన చేస్తుంది మరలా నువు ఓటమి పాలని
    కాదు కాదు కాదు ప్రభువు చేప్తున్నడు నేను నీకు తోడని
    నిన్ను మించినోళ్ళు నీకు పోటీ ఉన్నా దీవెన మాత్రం నీదని
    యొహొవానైన నాకు అసాధ్యం ఉన్నాదా అని!

4.  చుట్టురూ ఉన్నోళ్ళు సహాలు యిస్తరు నువ్వు అడ్డదార్లు తొక్కేయ్ అని
    గాల్లోన దీపాన్ని పెట్టేసి దేవుడా అంతెయ్ నీకు లాభం ఉండ్దని
    గాల్లో దీపం కాదు మా నిరీక్షణుంది సర్వశక్తుడు యేసులో
    అడ్డదార్లు వద్దు రాజమార్గముంది సిమ్హాసనమునకు క్రీస్తులో
    యేసు క్రీస్తునందు ఈ న్రీక్షణ్ మమ్మును సిగ్గుపరచదు!

5.  అప్పులు ఒత్తిళ్ళు కృంగదీస్తాయి యింక ఈ బ్రతుకు ఎందుకని
    అవమాన భారంతో పరువు చెబుతుంది నీకు ఆత్మహత్యే శరణని
    చచ్చినాక నువ్వు ఏమి సధిస్తావు యేసుని విశ్వసించరా
    ఒక్క క్షణములోనే నీ సమస్యలన్నీ ప్రభువు తీర్చగలడురా!
    నీవు చావక బ్రతికి దేవుని క్రియలను చాటు సోదరా!

6.  డబ్బులు అయిపొతే దిగులు పుడుతుంది అయ్యొ!రేపటి సంగతేంటని
    వస్తులు ఉంటుంటే ప్రణము అంటుంది ఈ రోజు గడిచేదెలాగని
    ఏలియాకు నాడు కాకోలము చేత రొట్టె పపినాడుగా!
    అరణ్యములోన్ మన్నను కురిపించి పూరేళ్ళు కుమ్మరించెగా!
    యెహోవా బాహూబలమేమైనా తక్కువైనదా!

7.  పాపపు వ్యసనాలు విరక్తి తెస్తాయి నువ్వు క్షమకనర్హుడవని
    యేసుకు దూరంగా ఈడ్చుకెళ్తాయి ప్రభువు నీపై కోపిస్తున్నడని
    ప్రానమిచ్చినోడు నిన్ను మరువలేడు ప్రేమతో పిలుచుచుండెరా!
    యేసువైపు తిరుగు ఆత్మచేత నడుపు గెలుపు నీదే సోదరా!
    శరీరమును దాని యిచ్చలతో సిలువెయ్యగవురా!

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------