366) ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ

** TELUGU LYRICS **

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా
జగాన మారనిది యేసు ప్రేమ

ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం
దేవ నీవు ప్రేమించుటకు నీ క్రుపే కారనం
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం
యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం

ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం
మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు

ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------