** TELUGU LYRICS **
ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు
ఉందునన్నావు సదాకాలము
యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై
ఉందునన్నావు సదాకాలము
యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై
||ఉన్నావు||
1. మోషేకు తోడై ఉన్నవాడనీవే
నీ జనుల నడిసంద్రాన నడిపించినావే (2)
అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే
ఆకాశమునుండి ఆహార మిచ్చితివే
బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే
నీ జనుల నడిసంద్రాన నడిపించినావే (2)
అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే
ఆకాశమునుండి ఆహార మిచ్చితివే
బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే
||ఉన్నావు||
2. సింహాల బోనులో దానియేలుతో
ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో (2)
ఐగుప్తునందున యేసేపుకు తోడై
ఆశీర్వదించి అధిపతిగ చేసితివే
శ్రమలలో నాతోడై వుందనన్నావే
ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో (2)
ఐగుప్తునందున యేసేపుకు తోడై
ఆశీర్వదించి అధిపతిగ చేసితివే
శ్రమలలో నాతోడై వుందనన్నావే
||ఉన్నావు||
3. కన్నీటి లోయలో కష్టాల కడలిలో
అద్దరికి చేర్చి నన్నాదు కొందువే (2)
నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే
నీ కంటి పాపలా కాపాడు దేవుడవే
ఇమ్మానుయేలువై నీవు నాకున్నావే
అద్దరికి చేర్చి నన్నాదు కొందువే (2)
నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే
నీ కంటి పాపలా కాపాడు దేవుడవే
ఇమ్మానుయేలువై నీవు నాకున్నావే
||ఉన్నావు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------