348) ఉన్నట్టు నేను వచ్చెదన్

** TELUGU LYRICS **

1.  ఉన్నట్టు నేను వచ్చెదన్
    పాపిష్ఠు న్నీవు పిల్వఁగన్
    నీ నెత్రుచేతఁ గడ్గుమా
    యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

2.  ఉన్నట్టు నేను వచ్చెదన్
    నే నొప్పుకొందుఁ దప్పులన్
    నీ మాటతో హరించుమా
    యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

3.  ఉన్నట్టు నేను వచ్చెదన్
    దుఃఖంబు బాధపర్చఁగన్
    బాపంబుఁ జేయనీకుమా
    యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

4.  ఉన్నట్టు నేను వచ్చెదన్
    యేసూ, కబోది నుండగన్
    ఆత్మీయదృష్టి నీయుమా
    యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

5.  ఉన్నట్టు నేను వచ్చెదన్
    నీ మాట నమ్మునట్టి నన్
    మన్నించి చేర్చుకొమ్మయా
    యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

6.  ఉన్నట్టు నేను వచ్చెదన్
    నీ ప్రేమ నన్నుఁ బిల్వగన్
    నీ వాఁడ నౌదు సర్వదా
    యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------