** TELUGU LYRICS **
తలుచుకుంటె చాలును - ఓ యేసు నీ ప్రేమ
జలజల జల రాలును - కృతజ్ఞతా కన్నీళ్ళు
తలుచుకొంటే చాలును - కరిగించును రాళ్ళను
కల్వరి స్వరము - ఇది కల్వరి స్వరము
||తలుచుకుంటె||
నీ మోమున ఊసిన ఉమ్ములు
నా మోహపు చూపు తుడిచెను
నీ చెంపను కొట్టిన దెబ్బలు
నా నోటిని శుద్ధి చేసెను (2)
నీ శిరస్సున గుచ్చిన ముండ్లు
నా మోసపు తలపును త్రుంచెను (2)
ఎంత త్యాగపూరితమో నీప్రేమా
ఎంత క్షమాభరితమో నీప్రేమా
||తలుచుకుంటె||
నీ దేహము చీరిన కొరడా
నా కామమును చీల్చెను
నీ చేతుల కాళ్ళకు మేకులు
నా చీకటి దారి మూసెను (2)
సిలువ నెత్తుటి ధారలు
నా కలుషమును కడిగి వేసెను (2)
ఎంత త్యాగపూరితమో నీప్రేమా
ఎంత క్షమాభరితమో నీప్రేమా
||తలుచుకుంటె||
---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
---------------------------------------------------------------------------------------