1106) తేనియకంటెను యేసుని నామం

** TELUGU LYRICS **   

    తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌను
    నీవు వరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనసా

1.  లోకములోన కష్టములెల్ల యేసుడు భరియించెన్
    పాపకీడును బాపెన్ శాపము మాపెన్ తెలిసికో ఓ మనసా

2.  పాపిన్ రక్షింప ప్రాణము నిచ్చెన్ యేక కుమారుండు
    ఇది యెంతటి కరుణ నిరింతర ముండును స్తుతించుము ఓమనసా

3.  అరుణోదయమున మంచువలె ఈ లోకము మాయమగున్
    నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో ఓ మనసా

4.  కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే
    తన రెక్కలక్రింద ఆశ్రయమిచ్చున్ నిశ్చయం ఓ మనసా

5.  భూలోక వాసుల్ పరలోక వాసుల్ ప్రభువును స్తుతించుడి
    యేసు నెరిగిన వారే పరమున చేర తగుదురు ఓ మనసా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------