526) ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా

** TELUGU LYRICS **

ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన
ఇదే కదా నీ ప్రేమ చరితం

నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
విరిగిన మనసే నీ ప్రియమై
మరువని మమతే నీ కరుణై
నిన్నే సేవింతును

శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలిచిన దేవా
దాపున జేరి దయనే చూపి నాలో వశమై నావా
తరగని సుఖమే నీ వరమై
కలిగిన బ్రతుకే నీ వశమై
నన్నే నడిపించిన

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------