597) ఓ వింత నా రక్షకుఁడా నాకై నీ విలువ రక్తము

** TELUGU LYRICS **

    ఓ వింత! నా రక్షకుఁడా నాకై నీ విలువ రక్తము కార్చితివా జీవాధిపతి
    మృతిఁ జెందె నహహా పురుగు వంటి నాకై నీ జీవ మర్పించి నావా
    ||ఓ వింత||

1.  నేను జేసిన పా పములకు నాయన మ్రానిమీఁదను మూల్గినావా
    నేను గ్రహింపలేని నీ జాలి కరుణ మితి లేని ప్రేమ దీని వలనను
    గనుపడుచు నున్నది
    ||ఓ వింత||

2.  పరమ శరీరుఁడు తా మరణ రక్తంబుచేతఁ గరుణతో నన్నుఁ బ్రోచినాఁ
    డా మరుతునా యీ ప్రేమ నా మరణంబు నందు సహా కర్తృ
    కటాక్షములు కలకాల ముండు నాతో
    ||ఓ వింత||

3.  నా యేసు నాధ నీకు నేనచ్చియున్న దెల్ల నా లేమితోఁ బ్రేమ గదా
    నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను నన్ను నేనే నీకు
    నర్పించుకొనుట గాక
    ||ఓ వింత||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------