576) ఓ ప్రియ యువకా నమ్మకు నీ యౌవ్వనం

** TELUGU LYRICS **    

    ఓ ప్రియ యువకా నమ్మకు నీ యౌవ్వనం
    దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా
    ఓ ప్రియ యువతీ నమ్ముకు నీ యౌవ్వనం
    దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా

1.  నీ యౌవ్వనము అశాశ్వతం నీ సౌందర్యము వాడిపోవును
    నీ ఆయుష్షు తరిగిపోవును నీ బలమంతయు క్షీణించును

2.  యేసే నీకు శాశ్వతము వాక్యమే నీకు దీపము
    ప్రార్ధనే నీకు ఆయుధము సౌక్ష్య జీవితమే నీ బలము

3.  యౌవ్వన ఆశలకు లొంగకు సాతాను వలలో చిక్కకు
    యేసుని చెంతకు చేరుము నిత్య రాజ్యమును పొందుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------