760) కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో

** TELUGU LYRICS **

    కుతూహల మార్భాటమే - నా యేసుని సన్నిధిలో
    ఆనంద మానందమే - నా యేసుని సన్నిధిలో
    ||కుతూహల||

1.  పాపమంత పోయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో
    క్రీస్తునందు జీవితం - కృప ద్వార రక్షణ పరిశుద్ధాత్మలో (2)
    ||కుతూహల||

2.  దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయం నేనే
    ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే (2)
    ||కుతూహల||
.
3.  శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును
    ఏకముగా కూడి, హోసన్న పాడి - ఊరంత చాటెదము (2)
    ||కుతూహల||

4.  భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండె
     ఒక్క క్షణములోనె, రూపాంతరము పొంది - మహిమలో ప్రవేశిద్దాం (2)
    ||కుతూహల||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------