** TELUGU LYRICS **
కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన
నాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడి
హృదయాలు పండించే వేళ ఈవేళ
నాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడి
హృదయాలు పండించే వేళ ఈవేళ
||కురిసింది||
కోయిలమ్మ పాడె అందమైన ఏదో రాగం
దాగెనమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావం
ఒంటరి జీవితం జంటగ మార్చెనే –
ఇరు హృదయాలను ఒకటిగా కూర్చెనే
దేవుడు కల్పిన బంధం – వీడిపోని అనుబంధం
దేవుడు కల్పిన బంధం – వీడిపోని అనుబంధం
||కురిసింది||
గోరుమావిడమ్మా పూచెనమ్మా అనురాగం
మరువకూడదమ్మా చేసుకున్న ఈ ప్రమాణం
వాక్యపు వెలుగులో బ్రతుకులు పండగా
దేవుడు తోడుగా నీతో నుండగా
సాగేటి ఈ బంధం – వీడిపోని అనుబంధం
||కురిసింది||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------