731) క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది

** TELUGU LYRICS **

    క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది
    పరుడని నరుడని భ్రమ పడకండి (2)
    దేవుని కుమారుడు
    ఈయనే దేవుని కుమారుడు

1.  ఈయన నా ప్రియ కుమారుడు
    ఈయన యందే ఆనందము
    తండ్రియే పలికెను తనయుని గూర్చి
    మీ కేమితోచు చున్నది 
    ||క్రీస్తు||

2.  రక్షకుడనుచు అక్షయుని చాటిరి
    దూతలు గొల్లలకు
    ఈ శుభవార్త వినియున్నట్టి
    మీకేమీ తోచు చున్నది
    ||క్రీస్తు||

3.  మర్మము నెరిగిన మహనీయుడు
    మరుగై యండక పోవునని
    సమరయ స్త్రీయే సాక్షమీయ్యగా
    మీకేమితోచుచున్నది
    ||క్రీస్తు||

4.  నీవు దేవుని పరిశుదుడవు మా జోలికి
    రావద్దనియు
    దయ్యములే గుర్తించి చాటగా-
    మీకేమి తోచుచున్నది
    ||క్రీస్తు||

5.  నిజముగ ఈయన దేవుని
    కుమారుడేయని సైనికుల
    శతాధిపతియే సాక్షమియ్యగ
    మీకేమి తోచుచున్నది
    ||క్రీస్తు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------