732) క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను

** TELUGU LYRICS **

1.  క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - సీయోను యాత్రలో
    లోకమున్ విడిచి చేరుకొందును మహిమ దేశమున్
    క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో
    మహానందముతో స్తుతించుచు చేరుదు నాదేశమున్
    పల్లవి: ఎంతో సుందర జీవితము - మహిమతో నిండినది
    సదా సర్వదా క్రీస్తుతో నుండి
    మహిమ పరచెదను - మహిమలో నుండెదను

2.  దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనే
    సంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదను
    ప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలో
    ఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును

3.  యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేను
    స్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్
    నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితో
    తోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------