745) క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి

** TELUGU LYRICS **

    క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి
    అను పల్లవి: సూచనలు చూపుచున్నవి - 
    వేచియుండుడి ఆయనకై

1.  రక్షణ సంపూర్తిచేయుటకై - అక్షయుడేసు వచ్చును
    అక్షణ పొందిన వారెల్లరు - తక్షణమే ఎత్తబడెదరు

2.  పరిశుద్ధులందు మహిమ నొంద - పరమ యేసు వచ్చును
    పరిశుద్ధులు వింతపడునట్లు - అరయునేసు వేగమే

3.  మరుగైనవి బయలు పరచ - వరుడు యేసు వచ్చును
    హృదయ ఆలోచనలెల్ల - సదయుడు బయలుపరచును

4.  వేయేండ్ల పాలన చేయుటకై - రయముగ యేసు వచ్చును
    సర్వరాజ్యములు అన్నియు - సర్వేశుడేసుని రాజ్యమగున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------