660) కరుణసాగర వీవేకావా మరణమొంద

** TELUGU LYRICS **

1.  కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ
    సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి
    నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా 
    ||కరుణ||

2.  నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు
    పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ
    జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ
    గ 
    ||నజరేతు||

3.  మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే
    కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను
    మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా 
    ||మరియయనే||

4.  మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను
    మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను
    మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా 
    ||మహిలోను||

5.  పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి
    ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను
    ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె
    ||పరమతండ్రి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments