675) కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా

కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా
కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా
అయ్యో పావురమా 
ఓ ఓ ఓ ఓ పావురమా
రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ
గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా
అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే
రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే

No comments:

Post a Comment

Do leave your valuable comments