709) కాలవిలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవు

    కాలవిలువ నీకు తెలియకపోయిన - కన్నీరు కార్చెదవు
    అను పల్లవి: భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశము
    భావమందు తలచి యేసుచే జీవించుము

1.  ఇష్టప్రకారము మనసు వీడి నడచి - కోప పాత్రుడ వగుదువె
    రక్షణ్య జీవితమొంది సంతోషించ
    ననుగ్రహ కాలమిదే యని తెలిసి

2.  ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె - నని తెలిసికొనుము
    ఘనమైన పనిని మరచి నిద్రించిన
    పగలు గతించక నిక నేమి చేతువు

3.  నోవహుకాలమున నూట ఇరువది - యేండ్లు చూచి లోకమును
    నశింప జేసెను కృపతో నీ కిడిన
    ఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన

4.  ముందు యిర్మియా హనన్యాకు తెలిపిన - ఏటనే మృతిపొందెను
    ఏ సమయము నీకు సొంత మనకుము
    ఈ ఏటనే నీవు మరణించవచ్చును

No comments:

Post a Comment

Do leave your valuable comments