** TELUGU LYRICS **
కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్
జీతము పొందును నిజ దాసుడు
ఆనందమొందెదరు ఆనందమొందెదరు
జీతము పొందును నిజ దాసుడు
ఆనందమొందెదరు ఆనందమొందెదరు
1. బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైనను
వెండి బంగారము విలువ రాళ్ళైనను
అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు
2. పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతిని
య్యోధుడవై మంచి బుద్ధిని కలిగిన
వాడబారని - (2) కిరీట మొందెదవు
3. ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలో
ప్రభుని రాకలో అందరి యెదుట
ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు
4. సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడ
ఆదర్శుండవై మందను కాచిన
మహిమ కిరీటము - (2) నీవు పొందెదవు
5. మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమును
తన ప్రత్యక్షత నపేక్షించుము
నీతి కిరీటము - (2) నీ కివ్వబడును
6. భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలను
అంతము వరకు నమ్మికయుంచిన
జీవకిరీటము - (2) పొందెద వెరుచు
7. దయచేయు శ్రేష్ట దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలు
ప్రార్థన యందు మేల్కొని యుండుము
స్వర్ణకిరీటము - (2) ధరింపజేయును
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------