1043) జోలా ప్రభు యేసయ్య ఒడిలోన జోల

** TELUGU LYRICS **

జోలా ప్రభు యేసయ్య ఒడిలోన జోల
జోలా దేవ దేవుని నీడలో జోల (2)
పరలోక తండ్రిని పరిశుద్ధుడని పలుకు
దూత గణములు పాడు వేళ  
||జోలా||

నిదురలో యేసయ్యతో ఆటాడు కుంటావు
ఆటలో ఎల్లప్పుడూ నువు నవ్వుతుంటావు (2)
నీ నవ్వులు మాకు కనపడినా 
దానికి తోరణము మాకు తెలిసేనా (2)
ఇదే ఇదే దైవ లీల (2) 
||జోలా||

ఊయలలో ఊహల్లో విహరిస్తూ వుంటావు
విహరిలో వేసారితే ఏడుస్తు వుంటావు (2)
నీ ఏడుపు మాకు వినపడినా 
దానికి కారణము మాకు కనపడునా (2)
ఇదే ఇదే దైవ లీల (2)
||జోలా||

నీ యేసు తోడులో నిండుగ జీవించు
నీ జీవన గమనంలో శ్రీయేసుని సేవించు
దీవెనలు మాకు కనపడినా
దానికి నడిపింపు మాకు వెలువడునా (2)
ఇదే ఇదే దైవ లీల (2)
||జోలా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------