1012) జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు

** TELUGU LYRICS **

    జీవపు మార్గ జ్యోతివి - సిలువ మోసిన యేసు
    మహిమ పూర్ణుడగు నీవే - సిలువ మోసిన యేసు

1.  శరీరధారివైతివి - నీ ప్రేమను కనుపరచితివి
    దీనుల నుద్ధరించితివి - సిలువ మోసిన యేసు

2.  నీవే మార్గ సత్యమని - నీకు పేరు కలిగెను
    నిత్యజీవపు దాతవు - పునరుత్థానుడవు నీవే

3.  అర్పణ చేసితివి బలిగా - సిలువపై నీ ప్రాణమును
    కడిగితివి నీ రక్తముతో - సిలువ మోసిన యేసు

4.  నీ ద్వారమున జేరితిమి - నీచులము అయోగ్యులము
    నీకే మహిమ స్తుతి ఘనత - సిలువ మోసిన యేసు

5.  కల్వరి మార్గ యాత్రికులం - నీకే జయమని పాడెదము
    సర్వద నిను స్తుతియించెదము - సిలువ మోసిన యేసు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------