1013) జీవమా చింతించకుండు నిన్నుఁ గావ

** TELUGU LYRICS **

    జీవమా చింతించకుండు నిన్నుఁ గావ వచ్చిన యేసు కరుణా మయుండు
    జీవమా చింతించి క్షితి మూరె డైన నీ జీవము కున్నతిఁ జేసెదవా
    కావున నీ చింతా క్రాంతము వెడలించు దేవుఁ డెహోవ నీ దిక్కని నమ్మి
    ||జీవమా||

1.  గగన వీధిని బోవు ఖగములు దున్నునా తెగఁగోసి కొట్లలో దాఁ
    చునొకో యగణిత పక్షుల కాహార మియ్యంగ బెగడెద వెందుకు
    పెంచు ని న్నత డు
    ||జీవమా||

2.  పక్షి వృక్షాదుల పై నింత ప్రేమతో భక్షణ లిచ్చుచుఁ బాలింపఁగా
    నక్షరములకంటె హెచ్చుగ నన్నెంచి యక్షయముగ నేలు నల్పవిశ్వాసి
    ||జీవమా||

3.  మిశ్రాయీం బాధల మేరల దొలఁగించి యిశ్రాయేలుకు మన్నా
    నియ్యలేదా యాశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను బాపి
    నిన్నేలునతడు
    ||జీవమా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments