1017) జీవమునిచ్చెద జీవాధిపతికి

** TELUGU LYRICS **

    జీవమునిచ్చెద జీవాధిపతికి
    జీవము నిచ్చెద నేను - నా (3)

1.  పాడెడు పక్షులు పాడక పోవును
    పుడమి గృహవనముల్ కూలిపోవున్ - నా

2.  మోము సౌందర్యము మాయమై పోవును
    ఈ మహి అందరము నశియించున్ - నా

3.  నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్
    గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ - నా

4.  మరణము వచ్చును ఖాయముగాను
    తరుణము దొరుకుట కష్టము - నా

5.  నగలు పుట్టములు కశించి పోవును
    నగర గోపురముల్ శిథిలమగున్ - నా

6.  పాప సంతోషము లిహమున నిల్చును
    పాపపు దేహము మన్నగును - నా

7.  హల్లెలూయ పాట పాడుటవలన
    నెల్లశ్రమలు నాకబ్బినను – నా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------