294) ఇమ్ముగ నీ సుదినంబు నుండి

** TELUGU LYRICS **    

    ఇమ్ముగ నీ సుదినంబు నుండి
    మిమ్ము నాశీర్వాదించెదను
    పొమ్మనిన ఓ మా ప్రభువా

1. మునుపటి మందిర మహిమను మించు
    కడపటి మంది-ర మహిమ
    ఈ స్థలమందు నా సమాధానం
    ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా

2.  అన్యజనులను కదిలింపగానే
    అన్ని వస్తువులు తేబడును
    వెండి బంగారము అన్నియు నావే
    దండిగ నిచ్చెద నంటివి ప్రభువా
3.  ఇంపుగ తొమ్మిద-వ మాసమున
    ఇరువది నాల్గ-వ దినము
    నీ మందిర ఆ-స్థి భారమును
    నీ వాజ్ఞాపించి వేయించితివి

4.  నీ ఆజ్ఞలను శిరసావహించి
    దివ్యంబుగ నా-బ్రాహాము
    హెబ్రోనులో గు-డారంబు వేసి
    కట్టెను బలిపీ-ఠము నా చోట

5.  నిండు మనస్సుతో కాలేబు నిన్ను
    దండిగ ననుస-రించగ
    హెబ్రోనును తన స్వాస్థ్యంబుగను
    సంభ్రముగ నొ-సంగిన దాత

6.  దావీదు రాజు నీ సన్నిధిలో
    దీనతతో మన-వి చేయ
    హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి
    ప్రభో కలుగు నీకు నీకు నిత్య మహిమ

7.  ఎల్లల నెల్ల విశాల పరచి
    కొల్లగ ప్రేమను జూపి
    ఎల్ల శక్తిని జూపిన ప్రభో
    హల్లెలూయ నీకే యేసు ప్రభో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------