302) ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే

** TELUGU LYRICS **

    ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని
    భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో
    మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల 
    ||ఇ||

1.  పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి
    బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును
    సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ
    ||ఇ||

2.  మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం
    బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె
    మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె
    ||ఇ||

3.  తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన
    సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్
    బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది
    ||ఇ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------