304) ఇలలో యేసునకే జయము

** TELUGU LYRICS **

    ఇలలో యేసునకే జయము - సర్వజనమా పాడు జయం

1.  జగముకొరకై ప్రభువు తన ప్రాణమిచ్చెను
    సర్వజనమా వినుడి మీరు తానే రక్షకుడు

2.  పాపులను ప్రేమించువాడు పాపి కాశ్రయుడు
    పాపులను తన దాపున జేర్చి పావనపరచును

3.  తానే మనకు నిత్య ప్రభువు రాజులకు రాజు
    అందర మొకటే పాడెదమిలలో ఆయనకే జయము

4.  జయధ్వనులను చేయరండి విజయుడేసునకే
    సర్వజనమా జయమని పాడు డాయనే జయశాలి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------