275) ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి

** TELUGU LYRICS **

    ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి మోక్ష సదనమున కేను
    బోదు సంతోషించు(డి 
    ||ఇదిగో||

1.  యెరూషలేమందుండి మీ రెదురు చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు
    దిగివచ్చి పనులు దెల్పును
    ||ఇదిగో||

2.  దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండఁ
    బరిశు ద్ధాత్మను బంపెదను
    ||ఇదిగో||

3.  నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య
    సామ్రాజ్యము నేల
    ||ఇదిగో||

4.  ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుఁడి నాదు సకలాజ్ఞలందు
    నిదియె సార మనుకొనుఁడి
    ||ఇదిగో||

5.  ఏదైననా పేరిటమీ రించుక వేఁడినను మీకు మోదముతోడదాని
    ముందే చేయుదును
    ||ఇదిగో||

6.  ఉల్లము లందుఁ గలఁత లెల్ల విడువుఁడి నేను మళ్లి వచ్చెడి విధము
    మరువకుండుఁడి
    ||ఇదిగో||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------