** TELUGU LYRICS **
ఇది న్యాయమా? - ఇది ధర్మమా?
శ్రీయేసు వార్తను దాచుట
నశియించు ఆత్మలన్ - దోచుట
||ఇది||
యేసుని నామములో రక్షణ వుందట
ఆ యేసుని నమ్మనిచో - నరకం తప్పదట (2)
అది తెలిసిన మీరు - తెలియని మాకు
ఆ వార్తను దాచుట - న్యాయమా?
మా ఆత్మలు దోచుట - ధర్మమా?
||ఇది||
ప్రకటించిన చోటే - ప్రకటిస్తున్నారే
విన్నవారికే మళ్ళీ - వినిపిస్తున్నారే (2)
పల్లెలను మరచి - ప్రభు ఆజ్ఞను విడచి
పరిచర్య చేయుట - న్యాయమా?
పట్టణాలలో తిరుగుట - ధర్మమా?
||ఇది||
-----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా)
-----------------------------------------------------------------------------