850) గురుతు చేసుకో ఓ ప్రియుడా


** TELUGU LYRICS **

గురుతు చేసుకో ఓ ప్రియుడా 
గుడిలో చేసిన ప్రమాణ సూత్రము 
మరిచిపోకుమా ఓ ప్రియతమా 
మెడలో కట్టిన ఆ మంగళసూత్రం 
తిరగబడితే క్రీస్తు కొరడా - చెళ్ళుమంటుందీ శుద్ధీకరణ 
||గురుతు||

స్వదేశీ సంస్కృతి మరిచి - విదేశీ సంస్కృతి మరిగి 
ఆత్మీయతను అణచి - అనురాగాన్ని విడచి 
పబ్ క్లబ్ తైతక్కలాడి - కాముకత్వము తలకెక్కి 
భార్యాభర్తల మార్పిడి చూడు 
కుటుంబ వ్యవస్థ దోపిడి నేడు
||గురుతు||

సాటి సహాయము మరిచి - సూటిపోటిగా పొడిచి 
భర్తను అనుమానించి - పిల్లల భవితను విడిచి 
ఇంటి గుట్టును రట్టుగ చేసి - భార్య నెదిరించి గడప దాటితే 
పెళ్ళి కాస్త పెటాకులై - కొంప కొల్లేరౌతుంది 
||గురుతు||

---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
---------------------------------------------------------------------------------------