** TELUGU LYRICS **
గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి
తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత
నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము

||గొప్ప||
1. నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు
భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు
నిలిపి కావు మనుచు వేఁడుకొందు
||గొప్ప||
2. చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు
సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు
మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు

3. విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు
చుందును బలుకులందుఁబనులయందు బలముఁ జూపి నిన్నుఁ
గొలిచి యిలను నిన్నుఁ బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని

4. మీఁది రాజ్యమందుఁ జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్నుఁ గరుణచే
సోదరులను గూడికొనుచు మోద మొప్పఁగ నీదు సేవఁ
బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :