836) గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం

** TELUGU LYRICS **

గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం - 
బాధపడినప్పుడు నీ హస్తం అభయం 
సూర్యచంద్రులను తలదన్నే కాంతిపుంజమా - 
సర్వసృష్టిని సృష్టించిన రక్షణ శృంగమా 
హలెలుయా లాలలలలా హలెలుయా లాలలలలా 
హలెలుయా హలెలుయా 
||గాయపడినప్పుడు||

నా జీవితమంతయు నీ సాక్షిగా నిలచెదన్ - 
నీ జీవవాక్యమును ప్రకటించేదన్ 
వర్ణింపగలదగునా నీ ఘనచరితను - 
వివరింపదగుదునా నీ ప్రేమ హృదయం 
హలెలుయా లాలలలలా హలెలుయా లాలలలలా 
హలెలుయా హలెలుయా
||గాయపడినప్పుడు||

నా క్రియలను దిద్దుచు నా పాపమే కడుగుచు - 
నా కోసమే నీవు బలియైతివి 
బంగారు కంటెను అపరంజికంటెను- 
నీ ఆజ్ఞలు ప్రియముగా వున్నవి 
హలెలుయా లాలలలలా హలెలుయా లాలలలలా 
హలెలుయా హలెలుయా
||గాయపడినప్పుడు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------